యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, టిక్కెట్ కౌంటర్, శివాలయం వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామిని 45వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.51,80,379 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
శివాలయంలో ఆర్జిత సేవలకు శ్రీకారం
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో నూతన ఆర్జిత సేవలను ఆలయ ఈవో భవానీ శంకర్ ఆదివారం ప్రారంభించారు. ప్రతి అష్టమి రోజున ఉదయం 8గంటల నుంచి 10 గంటల వరకు పర్వతవర్ధిని అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన పూజా కార్యక్రమం ఉంటుందన్నారు. టిక్కెట్ ధర రూ.500 నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ పూజలకు ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న
45వేల మందికి పైగా భక్తులు


