మా ఊర్లో బంటి అనే అబ్బాయి
ఉండేవాడు. అతడు చదువులో కాస్త వెనుకబడి ఉన్నా, అతని మాటలు మాత్రం ప్రతిఒక్కరికి నవ్వులు పూయించేవి. అతడు ఏం మాట్లాడినా విచిత్రంగా ఉంటుంది. అతడికి, స్కూళ్లో మాస్టారు మధ్య స్కూల్లో జరిగిన ఓ సరదా సంభాషణను మీతో పంచుకుంటున్నా..
ఒకరోజు స్కూల్లో మాస్టారు అడిగాడు : ‘‘అరేయ్ బంటిం పంచపాండవులు ఎంత మంది రా..?’’
బంటి వెంటనే లేచి, చేతితో రెండు వేళ్లు చూపిస్తూ,
‘‘మంచం కోళ్ల లాగా ముగ్గురు అండి!’’ అన్నాడు.
క్లాస్ మొత్తం ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయింది.
మాస్టారు తల పట్టుకుని, ‘‘అబ్బా! పంచపాండవులు ఐదుగురు రాం’’అన్నాడు.
అదే రోజు మళ్లీ మాస్టారు అడిగాడు : ‘‘సరే, 5 + 5 ఎంత?’’
బంటి కాస్త కన్‌ఫ్యూజ్ అయి, పక్కన కూర్చున్న చంటిని నెమ్మదిగా అడిగాడు.
చంటి ‘‘పది’’ అని గుసగుసలాడాడు.
బంటికి వినిపించకపోవడంతో బాగా గట్టిగా ‘‘పంది!’’ అన్నాడు.
మాస్టారు కోపంతో, ‘‘ఇది స్కూల్ రా, పందుల బజారు కాదు!’’అన్నాడు.
ఇంకో రోజు
మాస్టారు: ‘‘సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు?’’
బంటి: ‘‘పుస్తకంలో అండి!’’
మాస్టారు: ‘‘ఎందుకు?’’
బంటి: ‘‘ఎప్పుడూ పుస్తకంలోనే చూస్తున్నాం కదా సార్ బయట చూడలేదు!’’ అన్నాడు.
మరోసారి
మాస్టారు: ‘‘నీ తండ్రి ఏం చేస్తాడు?’’
బంటి: ‘‘టీవీ చూస్తాడు సార్‌ం’’
మాస్టారు: ‘‘అది పని కాదు రా!’’
బంటి: ‘‘అయితే మా అమ్మ కూడా అదే పని చేస్తుంది సార్!’’ అన్నాడు.
క్లాస్ అంతా మళ్లీ నవ్వులతో మార్మోగింది.
చివరికి మాస్టారు ఇలా అనుకున్నాడు: ‘‘చదువు రాకపోయినా, నవ్వులు పంచడంలో బంటి మాత్రం ఫస్ట్ క్లాస్
– ఆముక్తమాల్యద కంచనపల్లి
ఫ పచ్చగా.. చల్లగా..
నకిరేకల్ : పట్టణంలోని సుందరయ్య నగర్‌కు చెందిన షేక్ గఫూర్ తన రేకుల ఇంటిపై ప్రతి వేసవిలో జమ్మి లేదా తాటి కమ్మలు పరిచి ఎండ నుంచి ఉపశమం పొందేవాడు. ఆరేళ్ల క్రితం తన బంధువు ఇచ్చిన తీగ జాతి మొక్కను గఫూర్‌కు తన ఇంటి ఆవరణలో నాటగా.. ఆ మొక్క రేకుల పైకప్పు మొత్తం పరుచుకుంది. వేసవిలో ఇల్లు చల్లగా ఉంటుందని గఫూర్ చెబుతున్నాడు.
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లికి చెందిన కృష్ణకుమారి తన ఇంటి ఆవరణలో సుమారు 50 రకాలకు పైగానే పండ్లు, పూలు, కూరగాయలు, మనీ ప్లాంట్, వివిధ రకాల నీడనిచ్చే మొక్కలతో పాటు ఆకుకూరలు పెంచుతూ హరితవనంలా మార్చింది. ప్రస్తుత వేసవిలో ఈ మొక్కలు చల్లటి నీడనిస్తున్నాయి.


