విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

హుజూర్‌నగర్‌ : వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన హుజూర్‌నగర్‌ మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన మేకపోతుల వీరస్వామి(48) పొలం వద్దకు వెళ్లి చాలాసేపటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుమారుడు వినయ్‌ పొలానికి వెళ్లి చూడగా బోరు మోటారు వద్ద వీరస్వామి విద్యుదాఘాతానికి గురై పడిపోయి కనిపించాడు. గ్రామస్తుల సహకారంతో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ బంద్‌ చేయించి వీరస్వామిని హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement