అక్రమంగా తరలిస్తున్న మూగజీవాల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న మూగజీవాల పట్టివేత

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

చిట్యాల : నిబంధనలకు విరుద్ధంగా ఆవులను తరలిస్తున్న లారీని సోమవారం చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ మామిడి రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైద్రాబాద్‌ వైపు లారీలో సుమారు 52 ఆవులను తరలిస్తుండగా.. చిట్యాలలోని రైల్వేస్టేషన్‌ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని కబేళాకు ఆవులను తరలిస్తున్నట్లు తేలడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్‌ మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆవులను చింతపల్లిలోని గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఐదు ఆవుదూడలు..

హుజూర్‌నగర్‌ : ఆవుదూడలను తరలిస్తున్న వాహనాన్ని సోమవారం హుజూర్‌నగర్‌లో పోలీసులు పట్టుకున్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ రాములునాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున హుజూర్‌నగర్‌లో పోలీసులు వాహనాలు తనఖీ చేస్తుండగా.. ట్రాలీ వాహనంలో ఐదు ఆవుదూడలను హైదరాబాద్‌ తరలిస్తుండగా పట్టుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకుని కారు, ట్రాలీ వాహనం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆవుదూడలను గోశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.

రెండు ఎద్దులు.. ఒక ఆవు..

కోదాడరూరల్‌ : ఏపీ నుంచి అక్రమంగా హైదరాబాద్‌ తరలిస్తున్న మూడు పశువులను సోమవారం కోదాడ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా కోసూరు నుంచి రెండు ఎద్దులు, ఒక ఆవును బొలేరో వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్‌ రోడ్‌లో పట్టుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడిన పశువులను గోశాలకు తరలించి వాహనాన్ని సీజ్‌ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement