ఇంటర్‌ మార్కుల్లో మార్పులు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ మార్కుల్లో మార్పులు

May 18 2026 9:55 AM | Updated on May 18 2026 9:55 AM

కొత్తగా ఏసీఈ గ్రూపు

భువనగిరి : ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు సెకండియర్‌కు మాత్రమే ఉన్న ప్రాక్టికల్‌ పరీక్షలు ఇక నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకు సైతం అమలు చేయనున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌ నుంచే ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ప్రాక్టికల్‌ పరీక్షలకు ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు కేటాయించినట్లు బోర్డు ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఫస్టియర్‌కు మాత్రమే ఈ సంస్కరణలు వర్తింపజేసి, 2027–28 నుంచి ద్వితీయ సంత్సరం వారికి సైతం అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు సెకండియర్‌లోనే బైపీసీ, ఎంపీసీ సబ్జెక్టుకు 30 మార్కులకు ప్రాక్టికల్స్‌ ఉండేవి. కానీ ఇక నుంచి ఫస్టియర్‌లో 15, సెకండియర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఎంపీసీలో భౌతిక, రసాయన శాస్త్రాలకు 15 మార్కుల చొప్పున 30 మార్కులు ఉంటాయి. బైపీసీ గ్రూపులో బోటని, జువాలజీలకు 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు

గణితంలో తగ్గిన మార్కులు

ఎంపీసీ విద్యార్థులకు ఇప్పటి వరకు గణితంలో 75 మార్కులకు రాత పరీక్ష ఉండగా ఈ సారి నుంచి 60 మార్కులకు మాత్రమే నిర్వహిస్తారు. మిగతా 15 మార్కులకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసనానికి (ఏబీఎల్‌) కేటాయిస్తారు. గణితంలో రెండు పేపర్లు ఉన్నందున తొలి ఏడాది ఏబీఎల్‌కు 30 మార్కులు ఉంటాయి. ఇతర గ్రూపుల్లోని కామర్స్‌, అకౌంటెన్సీ, రాజనీతి శాస్త్రం, చరిత్ర, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిష్ట్రేషన్లకు 80 మార్కులుకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్‌ పరీక్షలు ఉంటాయి. అలాగే లాంగ్వేజ్‌ సబ్జెక్టులైన తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్‌, రాత పరీక్షలకు 80మార్కులు, 20 మార్కులు ఇంటన్నల్‌ మార్కులు ఉంటాయి.

ఇంటర్మీడియట్‌లో ఈ ఏడాది నుంచి కొత్తగా ఏసీఈ గ్రూపును బోర్డు అమలులోకి తీసుకొచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ గ్రూపులో అకౌంటెన్సీ, ఎకనామిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులు ఉంటాయి. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సును అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఏసీఈ గ్రూపును ప్రవేశపెట్టినట్లు బోర్డు ప్రకటించింది. ఈ కోర్సు చార్టెడ్‌ అకౌంట్‌కు పునాది లాంటిది.

ఫ ఫస్టియర్‌ నుంచే ప్రాక్టికల్‌ పరీక్షలు

ఫ ఎంపీసీ, బైపీసీలో ప్రాక్టికల్‌కు 15 మార్కులు కేటాయింపు

ఫ 2026–27 విద్యాసంవత్సరం

నుంచి అమలు

Advertisement
 
Advertisement
Advertisement