ఉప్పల్ భగాయత్ రోడ్డు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఆ మార్గంలో బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. కాబట్టి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హయత్‌నగర్ చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాలి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే భారీ వాహనాలు ఎల్బీనగర్, హయత్‌నగర్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి, ఘట్కేసర్ ద్వారా వరంగల్ హైవేకు చేరుకోవాలి. రోడ్డు నిర్మాణ పనులు సజావుగా సాగడానికి, ట్రాఫిక్ నియంత్రణకు వాహనదారులు, ప్రయాణికులు అందరూ పోలీసు శాఖకు పూర్తిగా సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
భువనగిరిటౌన్ : ఉప్పల్ రింగ్ రోడ్డు పరిధిలో చేపడుతున్న అత్యవసర నిర్మాణ పనుల దృష్ట్యా ఈనెల 17 (ఆదివారం) ఉదయం నుంచి ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను మళ్లించడమే కాకుండా బస్టాప్‌ను కూడా తాత్కాలికంగా మారుస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్, హనుమకొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు వైపు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటివరకు ఉప్పల్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం పక్కన ఉన్న బస్టాప్‌ను బోడుప్పల్‌లోని నల్లచెరువు కట్ట సమీపంలో తాత్కాలిక బస్టాప్‌ను ఏర్పాటు చేశారు.
చిన్న వాహనదారుల కోసం..
కార్లు, బైకులు వంటి చిన్న వాహనాల విషయానికి వస్తే, వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వారు మే ఫీల్ హోటల్ దాటిన తర్వాత ఉప్పల్ భగాయత్ మార్గం ద్వారా నాగోల్ చేరుకోవాలి. అక్కడ సర్వీస్ రోడ్డు ద్వారా ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వారు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద గల పిస్తా హౌస్ పక్క నుంచి బీరప్పగడ్డ మీదుగా ప్రయాణించి, జాతీయ రహదారి 163 ఎక్కి వరంగల్ వైపు వెళ్లాలి.
ఫ ఉప్పల్ రింగ్ రోడ్డు పరిధిలో అత్యవసర పనుల దృష్ట్యా నిర్ణయం
ఫ బోడుప్పల్‌లోని నల్లచెరువు కట్ట వద్ద వరంగల్, యాదగిరిగుట్ట బస్టాప్
ఫ ప్రయాణికులు గమనించాలని ఉన్నతాధికారుల విజ్ఞప్తి


