యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ క్యూకాంప్లెక్స్ సహా అన్ని ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. బ్రేక్ దర్శనానికి అర గంట సమయం పట్టింది. స్వామి వారిని సుమారు 30 వేలమందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజల ద్వారా ఆయా విభాగాల్లో స్వామి వారికి నిత్య ఆదాయం రూ..52,63,697 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లఢించారు.


