చివ్వెంల(సూర్యాపేట) : విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటనలు చివ్వెంల మండల పరిధిలోని వాల్యతండా, కోమటికుంట గ్రామాల్లో గురువారం జరిగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని వాల్యతండా గ్రామానికి చెందిన ధరావతు అనూష (25) ఇంట్లో ఉతికిన దుస్తులు అరవేస్తుండగా, దండెంకు విద్యుత్ సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త రాంచంద్రు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు.
పెళ్లింట్లో విషాదం..
తెల్లవారితే పెళ్లి.. ఇంట్లో విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పెళ్లి కుమార్తె తమ్ముడు మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని కోమటి కుంట గ్రామానికి చెందిన పిట్టల దినేష్ (19) తన సోదరి పెళ్లి శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో ఇంట్లో విద్యుత్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడి సృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లింట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడి తండ్రి పిట్టల సైదులు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన
పిట్టల దినేష్
మృతురాలు
అనూష (ఫైల్)
ఫ దుస్తులు ఆరేస్తూ ఒకరు..
ఫ పెళ్లి పనులు చేస్తుండగా మరొకరు..


