నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు

May 11 2026 7:14 AM | Updated on May 11 2026 7:14 AM

రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా నిరుద్యోగులు రుణపడి ఉంటారు

భువనగిరి : నైపుణ్యాలను పెంపొందించుకుంటే నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆవరణలో కుంభం ఫౌండేషన్‌, 1ఎం1బీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మెగా జాబ్‌మేళా ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కుంభం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరిలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన శిక్షణ అందించేవిధంగా స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని 1బీఎంను కోరారు. అనంతరం ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కుంభం ఫౌండేషన్‌ చైర్మన్‌ కుంభం కీర్తిరెడ్డి, 1బీఎం అసోసియేట్‌ డైరెక్టర్‌ ప్రసన్న నౌరి, డైరెక్టర్స్‌ అభిరామ్‌, వెంకటేష్‌, దీపిక తదితరులు పాల్గొన్నారు.

1500 మంది ఎంపిక

ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన మెగా జాబ్‌మేళా ఆదివారం ముగిసింది. రెండు రోజులపాటు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న మూడు వేల మంది అభ్యర్థులకు ప్రీ స్క్రీనింగ్‌ నిర్వహించి ఇంటర్వ్యూల కోసం 1800 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 27 కంపెనీల్లో 3500 ఖాళీల భర్తీ కోసం ఆదివారం అభ్యర్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యులు నిర్వహించారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 1500 మంది అభ్యర్థులను వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు.

డిప్లొమా పూర్తి చేశా. రెండు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలు సుకుని దరఖాస్తు చేసుకున్నా. ఇంటర్వ్యూలో రాణించడంతో ఉద్యో గం కోసం ఎంపిక చేశారు. ఎలక్ట్రికల్‌ విభాగంలో ఎంపిక కావడం సంతోషంగా ఉంది.

–కొండపురం పూజ

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా. భువనగిరిలో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వెంటనే జాబ్‌కోసం దరఖాస్తు చేసుకున్నా. ఉద్యోగానికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగాఉంది. నిరుద్యోగుల కోసం ఇలాంటి జాబ్‌ మేళా పెట్టివారికి, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తున్న వారికి నిరుద్యోగులు రుణపడి ఉంటారు. – శ్రీవాణి

ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

Advertisement
 
Advertisement
Advertisement