భువనగిరి : గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆస్పత్రుల నిర్వహణ, తాగు నీరు, పారిశుద్ధ్యం, భవన మరమ్మతులు, విద్యుత్ బిల్లులు, స్వీపర్‌కు వేతనాలు, ఫర్నచర్, వైద్య పరికరాలు, అత్యవసర మందులు కొనుగోలుకు ప్రతి సంవత్సరం హాస్పిటల్ డెవలప్‌మెంట్ ఫండ్ (హెచ్‌డీఎఫ్)ను ప్రభుత్వం అందిస్తుంది. కానీ మూడేళ్లుగా హెచ్‌డీఎఫ్ ఫండ్ విడుదల కాకపోవడంతో పీహెచ్‌సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో రావాల్సిన నిధులు నిలిచి పోవడంతో ప్రతి చిన్న పనికి నిధుల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నిలిచిన నిధులు
హెచ్‌డీఎఫ్ నిధులు విడుదల కాకపోవడంతో వైద్య పరికరాలు కూడా మరమ్మతులకు నోచడం లేదు. దాంతో ల్యాబ్ పరీక్షలపై ప్రభావం పడుతోంది. ఫలితంగా పీహెచ్‌సీల్లో మందులు, పరీక్షలు లేక రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రోగుల తాకిడికి అనుకూలంగా వసతులు కల్పించే పరిస్థితి లేదు. కొన్ని పీహెచ్‌సీలలో కుర్చీలు విరిగినా, వైద్య పరికరాలు చెడిపోయినా మరమ్మతులు చేయడం లేదు. దాంతో పాటు విద్యుత్, తాగునీటి బిల్లులపై కూడా ప్రభావం పడుతోంది.
రావాల్సినవి రూ.47.15 లక్షలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు కేంద్రం ఆర్థిక చేయూత అందిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి సుమారు రూ.75వేల చొప్పున మంజూరు చేస్తోంది. జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు న్నాయి. దీని ప్రకారం 21 కేంద్రాలకు ఏడాదికి రూ. 15.75 లక్షలు చొప్పున మూడు సంవత్సరాలకు రూ. 47.25 లక్షలు విడుదల కావల్సి ఉంది.
ఫ పీహెచ్‌సీలకు మూడేళ్లుగా నిలిచిన హెచ్‌డీఎఫ్ నిధులు
ఫ ఆరోగ్య కేంద్రాలలో వసతులు కరువు
ఫ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలపై ప్రభావం
ఫ జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు


