భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ పెట్టవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తో కలిసి 75 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని, కొన్ని శాఖలు ఉద్యోగుల వివరాలు అందజేయలేదన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. ట్యాబ్ ఎంట్రీలు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


