యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైన కొన్నేళ్ళుగా కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి, ఆ సంఘం ద్వారా నడుస్తున్న దుకాణాలకు టెండర్లు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆర్‌అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు శనివారం యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. వర్తక సంఘం పేరిట దేవస్థానానికి 10 దుకాణాలకు ఏడాదికి కేవలం రూ.1.68కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారని, అదే సెల్ ఫోన్ కౌంటర్ టెండర్ సంవత్సరానికి రూ.2.22కోట్లకు పైగా ఆదాయం వస్తుందని మంత్రులకు వివరించారు. అంతే కాకుండా ఇతర టెండర్ల ద్వారా కూడా దేవాలయానికి అధిక ఆదాయం వస్తుందని మంత్రులకు తెలిపారు. వినతి ఇచ్చిన వారిలో బండ రామస్వామి, కల్వకొలను సతీష్‌రాజ్, దేవపూజ అశోక్, బండి వాసు, కొన్నె సంజీవ, మాటూరి బాలయ్య, పబ్బాల ఉప్పలయ్య, మిర్యాల కృష్ణ, బండి అనిల్, కర్రె ప్రవీణ్, గుండు కుమార్, శ్రీనాథ్ ఉన్నారు.
ఫ మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డికి యాదాద్రి పరిరక్షణ కమిటీ వినతి


