నిర్దేశిత గడువులోగా పనులు | - | Sakshi
Sakshi News home page

నిర్దేశిత గడువులోగా పనులు

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

సాక్షి, యాదాద్రి : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు ఆదేశించారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌కు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం, స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ పనుల ప్రగతిపై ఆయన సమీక్షించారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ రూల్‌ 2026 అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ముఖ్యకార్యనిర్వహణాధికారి శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి , డీఆర్‌ఓ జయమ్మ, డీపీఓ శ్రీనివాస్‌ రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌ , వివిధ మండలాల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పరిశీలన

భువనగిరి(బీబీనగర్‌): బీబీనగర్‌ మండల పరిధిలోని కొండమడుగు గ్రామ పంచాయతీ లో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు మంగళవారం పరిశీలించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో తాగునీరు, విద్యుత్‌, రోడ్ల సౌకర్యాలు కల్పించాలని అధికారులను అదేశించారు. మౌలిక వసతుల పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్‌ కార్పొరేషన్‌ పీడీ అలివేలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ రవికిరణ్‌, రాకేష్‌కుమార్‌, ఏఈ గీత, తహసీల్దార్‌, ఎంపీడీఓలు శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement