ఆత్మకూరు(ఎం) : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా అమలవుతున్న పలు అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరి డాక్టర్ మూనా యాస్మిన్ అన్నారు. బుధవారం మండలంలోని సర్వేపల్లి గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ భవనం ఎందుకు నిర్మించుకున్నారని మహిళలను ప్రశ్నించారు. గతంలో సమ భావన సంఘాల సభ్యులు చెట్లకింద, గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించుకునేవారని, ప్రస్తుతం భవనం నిర్మించడంతో ప్రయోజనకరంగా ఉందని మహిళలు ఆమెకు వివరించారు. అనంతరం డిప్యూటీ సెక్రటరిని సర్పంచ్ కల్వకుంట్ల ఉపేందర్‌రెడ్డి శాలువాతో సన్మానించారు. ఆమె వెంట డీఆర్‌డీఓ నాగిరెడ్డి, అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్, ఎంపీడీఓ రాములునాయక్, ఏపీఓ బి.రమేష్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి రచ్చ పల్లవి, ఏపీఎం గోదాసు నర్సింహ, ఈసీ శ్రీనువాస్, పంచాయతీ కార్యదర్శి నరేష్, సీసీలు కొమురయ్య, హరిబాబు, వీఓఏ లావణ్య ఉన్నారు.
మోటకొండూర్‌లో పర్యటన
మోటకొండూర్ : కేంద్ర గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రటరీ మూనా యాస్మిన్ బుధవారం మోటకొండూర్‌తో పాటు మండలంలోని మాటూర్, అమ్మనబోలు గ్రామాలలో పర్యటించారు. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, పీసీపీ వర్క్ , స్కూల్ టాయిలెట్స్, పీఎంజీఎస్‌వై రోడ్డులను పరిశీలించారు. డ్వాక్రా రుణంతో కొనుగోలు చేసిన ఆటో, పిండి గిర్నీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంపీడీఓ ఇందిర, ఎంపీఓ చంద్రశేఖర్, ఈసీ గోవర్ధన్, సర్పంచ్‌లు భూమండ్ల జయమ్మ, జెన్నె సిద్దులు ఉన్నారు.
ఫ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ డిప్యూటీ సెక్రటరి మూనా యాస్మిన్


