వాలీబాల్‌ నేర్చుకుందాం రండి..! | - | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ నేర్చుకుందాం రండి..!

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

కోదాడ : వేసవి సెలవుల్లో కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయస్థాయిలో వాలీబాల్‌ ఆడిన పలువురు క్రీడాకారులు, పీఈటీల ఆధ్వర్యంలో వాలీబాల్‌ క్రీడలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. క్రీడాకారులకు కావల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, సీనియర్స్‌ కూడా ఇక్కడకు రోజూ వస్తారు. వారి అనుభవాలతో మంచి వాలీబాల్‌ క్రీడాకారుడిగా ఎదగడానికి మంచి అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement