మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని చేపట్టిన 4వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఇప్పటికే మూడు యూనిట్ల ద్వారా 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అందిస్తుండగా తాజాగా మూడో యూనిట్ బుధవారం రాత్రి వరకుకమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ)ని 72 గంటల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి నాలుగు యూనిట్ల ద్వారా 3200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. పవర్ ప్లాంట్‌లో మొత్తం ఐదు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ ద్వారా 800 మెగావాట్లతో 4వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్లాంట్‌లో ఇప్పటి వరకు 1, 2, 4వ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం మూడవ యూనిట్ పూర్తి కావడంతో మొత్తం నాలుగు యూనిట్ల ద్వారా 3200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మరో యూనిట్ పనులు పూర్తి కావాల్సి ఉంది. పవర్ ప్లాంట్‌లో మూడో యూనిట్ 72గంటల పాటు సీఓడీని విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో టీజీ జెన్‌కో సీఎండీ ఎస్.హరీష్, సీఈలు రమేష్‌బాబు, సురేష్‌వర్మ బుధవారం రాత్రి ఏర్పాట్లను పర్యవేక్షించారు.


