శాంతిభద్రతలు లోపించాయి | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలు లోపించాయి

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

నకిరేకల్‌ : తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడి తప్పిందని, శాంతిభద్రతలు లోపించాయని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌పై నమోదు అయిన ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నకిరేకల్‌ మెయిన్‌ సెంటర్‌లో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌పై ఫోక్సో కేసు నమోదై ఏడు రోజులు గడుస్తున్నా అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. మహిళల భద్రత, మైనర్ల రక్షణ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీజేపీ నాయకులు ఇలాంటి సంఘటనలపై సమాధానం చెప్పాలన్నారు. ఈ సంఘటనుకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేష్‌, నకిరేకల్‌, కేతేపల్లి మండలాల బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, నాయకులు పెండెం సదానందం, సైదిరెడ్డి, పల్‌రెడ్డి మహిందర్‌రెడ్డి, పల్లె విజయ్‌, గుర్రం గణేష్‌, పేర్ల కృష్ణకాంత్‌, నోమలు కేశవరాజులు, సామ శ్రీనివాస్‌రెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్‌, రావిరాల మల్లయ్య, దైద పరమేషం, జంగయ్యగౌడ్‌, విజయ్‌కుమార్‌, జానయ్య, ఇమడపాక వెంకన్న, నాగిల్ల వెంకటయ్య, అమీర్‌ పాష, లింగరాజు, స్టీఫెన్‌, శివమూర్తులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పింది

నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే

చిరుమర్తి లింగయ్య

బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని రాస్తారోకో

Advertisement
 
Advertisement
Advertisement