నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

చౌటుప్పల్‌ : ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తిచేస్తామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. గురువారం చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. మార్కెట్‌ చైర్మన్‌ ఉబ్బు వెంకటయ్యను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం నిలువ చేస్తున్న ఐఎంజీ గోదాము వద్దకు వెళ్లి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్‌లో లక్ష్యానికి మించిన ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 358 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1.45లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 38 రైస్‌ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్‌ అంకిరెడ్డిగూడెం గ్రామంలోని మల్లికార్జున రైస్‌మిల్లును ఆకస్మికంగా సందర్శించారు. పలు వివరాలు అడిగి తెలుసుకుని మాట్లడారు. ధాన్యం లారీలు మిల్లుల వద్ద ఆగవద్దన్నారు. హమాలీలను సరిపడా పెట్టుకోవాలని సూచించారు. ఏరోజు వచ్చిన లారీని అదే రోజున దిగుమతి చేసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి, ఎస్పీ అక్షాంష్‌యాదవ్‌, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి పీవి.రమణారెడ్డి, డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్‌, తహసీల్దార్‌ వీరాభాయి, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ ఆకుల ఇంద్రసేనారెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వర్లు, ఏఓ ముత్యాల నాగరాజు, ఆర్‌ఐ బాణాల రాంరెడ్డి, ఏఈఓ శ్రావ్య, రైతులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement
 
Advertisement
Advertisement