యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు

May 11 2026 7:14 AM | Updated on May 11 2026 7:14 AM

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన పూజను విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను భక్తులతో చేయించారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను అర్చకులు ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వారా బంధనం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement