ఇద్దరు చైన్‌ స్నాచర్ల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు చైన్‌ స్నాచర్ల అరెస్టు

May 17 2026 7:32 AM | Updated on May 17 2026 7:32 AM

నల్లగొండ : తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో ఇటీవల వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న ఎర్రగడ్డలగూడేనికి చెందిన చింతమల్ల సత్యమ్మ మర్రిచెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉండగా.. బాణాల హరిచంద్రప్రసాద్‌, మైనర్‌ బాలుడు ఆమె వద్దకు వచ్చి ఆమె మెడలోని 30 గ్రామలు బంగారు గొలుసు లాక్కుని బైక్‌పై పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసిన తిప్పర్తి పోలీసులు.. సీసీఎస్‌ బృందాలతో కలిసి నిందితులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో వాహనాలు తనిఖీ చేస్తున్న తిప్పర్తి పోలీసులను చూసి ఇద్దరు నిందితులు పారిపోయేందుక యత్నించగా.. వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, బైక్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement