ఉపాధి హామీ పథకంతో నీటి సంరక్షణ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ పథకంతో నీటి సంరక్షణ

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

భువనగిరి: ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు నీటి సంరక్షణకు ఎంతో దోహదపడుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్‌ మోనా యాస్మిన్‌ అన్నారు. మంగళవారం భువనగిరి మండలంలోని హన్మాపురం, తాజ్‌పూర్‌ గ్రామాలలో ఉపాధి హామీ పనులను వాటి నాణ్యతను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం పనుల అమలులో నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. అంతకు ముందు ఇంకుడు గుంతలు, ఏరియా ఆఫీసర్‌ యాప్‌ లో నమోదు చేసిన ఫొటోలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, అడిషనల్‌ డీఆర్‌డీఓ జంగారెడ్డి, ఏపీడీ నవీన్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ర్యాకల సంతోషశ్రీనివాస్‌, నాయిని సువర్ణకృష్ణ, ఎంపీఓ దినకర్‌ సిబ్బంది ఉన్నారు.

మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి

భూదాన్‌పోచంపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్‌ మోనా యాసిన్‌ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆమె పోచంపల్లి మండలంలోని గౌస్‌కొండ, శివారెడ్డిగూడెం గ్రామాలను సందర్శించారు. గౌస్‌కొండలో మహిళ సంఘాలకు సబ్సిడీపై అందజేసిన ప్యాడీ క్లీనర్‌లను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద శివారెడ్డిగూడెం, దంతూర్‌ గ్రామాల మధ్యన చిన్నేటిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎన్ని గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని, పనుల్లో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్‌ బొక్క మల్లారెడ్డి ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, భాస్కర్‌, అడిషనల్‌ డీఆర్‌డీఓ సురేశ్‌, కోట జంగారెడ్డి, డీఈ ప్రసాద్‌, ఏపీఎం తౌర్యానాయక్‌, ఏపీఓ కృష్ణమూర్తి, పీఆర్‌ ఏఈ జగపతిబాబు, ఉపసర్పంచ్‌ వాకిటి బాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు హరిత, రజిత, సీసీ మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మోనా యాస్మిన్‌

Advertisement
 
Advertisement
Advertisement