సాక్షి యాదాద్రి : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకే అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్‌స్కూల్స్ నిర్మిస్తున్నదని, వీటిలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన అందుబాటులో ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యా వారోత్సవాల వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జూన్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులందరికీ ఉదయాన్నే అల్పాహారం, పాలు, రాగిజావ వంటివి అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగిందని, పదో తరగతి ఫలితాల్లో సైతం విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణించడం గర్వకారణమన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న జనగణనలో ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సహకరించాలని సూచించారు. అనంతరం ‘అమ్మ ఆదర్శ పాఠశాల‘ కమిటీ చైర్ పర్సన్లను ఎమ్మెల్యే, అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డీఈఓ కె. సత్యనారాయణ, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణి, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల, సర్పంచ్‌లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన
భువనగిరి : మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో రూ.26 కోట్లతో చేపడుతున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల భవన నిర్మాణం పూర్తయితే స్థానిక యువతకు ఉన్నత విద్యతో పాటు విస్తృతంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. భవిష్యత్తులో భువనగిరి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మి, సర్పంచ్ రాంపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ నాణ్యమైన విద్యకోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
ఫ భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి


