నిధులు రాకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

నిధులు రాకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

మోత్కూరు: దళిత బంధు నిధులు విడుదల కాకుండా ఎమ్మెల్యే మందుల సామేల్‌ అడ్డుకుంటున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. ఈవిషయంలో మోతూరులో ఎమ్మెల్యేతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా విలేకరులో వారు మాట్లాడారు. గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని మొదటి విడత విజయవంతంగా అమలు చేసిందని , 2023లో రెండో విడతలో భాగంగా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన 254 మంది లబ్ధిదారుల అకౌంట్లలో రూ.3 లక్షల చొప్పన జమ చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చి కోడ్‌ అమల్లోకి రావడంతో రూ.3 లక్షలు జమ చేసిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసిందన్నారు. అంతటితో పథకం ఆగిపోయిందని కానీ యూనిట్లు మంజూరైన వారికి గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని 2025లో ఎస్సీ కార్పొరేషన్‌ ఎం.డీ ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలుకు చర్యలు తీసుకున్నారుకానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అడ్డగూడూరు, మోత్కూరు మండలాలకు చెందిన 254 మంది కుటుంబాల లబ్ధిదారులకు మాత్రం నిధులు విడుదల కాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉండి దళితుల పొట్ట కొడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని గ్రౌండింగ్‌ పూర్తి చేసి నిధులు విడుదలయ్యేలా చూడాలని లేకుంటే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు కూరెళ్ల రమేష్‌, బండి వెంకటేష్‌, దాసరి నరేష్‌, బుషిపాక శ్రీకాంత్‌, ఆనంద్‌, నాగరాజు, ఆనందం తదితరులు పాల్గొన్నారు.

ఫ దళిత బంధు లబ్ధిదారుల ఆరోపణ

ఫ ఎమ్మెల్యే సామేల్‌తో వాగ్వాదం

Advertisement
 
Advertisement
Advertisement