ఐఎఫ్‌ఎస్‌ ర్యాంకర్‌ను అభినందించిన డీజీపీ | - | Sakshi
Sakshi News home page

ఐఎఫ్‌ఎస్‌ ర్యాంకర్‌ను అభినందించిన డీజీపీ

May 15 2026 9:50 AM | Updated on May 15 2026 9:50 AM

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ యాదగిరి కుమార్తె చల్లా యామిని ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఆలిండియా ఫారెస్ట్‌ సర్వీస్‌లో 119వ ర్యాంకు సాధించింది. బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో చల్లా యామినిని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌, లా అండ్‌ ఆర్డర్‌ డీజీపీ మహేష్‌ భగవత్‌ సన్మానించి అభినందించారు. కానిస్టేబుల్‌ కుమార్తె కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సాధించడం గర్వకారణమన్నారు.

మందుబాబులకు

జైలు శిక్ష, జరిమానా

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన ఆరుగురిని బుధవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చినట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ సాయిరాం తెలిపారు. వారిలో ఒకరికి 2 రోజుల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా, మరో ఐదుగురికి కలిపి రూ.2,600 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్‌జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు.

బాలుడి అదృశ్యం

మిర్యాలగూడ టౌన్‌ : ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యాడు. వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని 19వ వార్డు ముత్తిరెడ్డికుంటకు చెందిన దేవరపల్లి లలిత, వేణు దంపతుల కుమారుడు శ్యాం పట్టణంలోని వినోభానగర్‌లో గల సెయింట్‌ మేరీ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిన శ్యాం తిరిగి రాలేదు. బాలుడి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతడి దేవరపల్లి లలిత బుధవారం వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగభూషణం తెలిపారు. ఈ బాలుడి ఆచూకీ తెలిస్తే 87126 70149 నంబర్‌కు సమాచారం అందించాలని సీఐ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement