రేపటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

భువనగిరి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 11 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ 3, ప్రైవేట్‌ కళాశాలల్లో 3 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణపై సిబ్బందితో పాటు పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు సూచనలు చేశారు.

పరీక్షలకు హాజరు కానున్న

5627 మందివిద్యార్థులు

ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగన్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 5,627 మంది హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 3,417 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 519 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 1,342 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 1,342 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 17 మంది సీఎస్‌, డీఓలను నియమించారు. వీరితో పాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఒకటి,రెండు సిట్టింగ్‌ బృందాలు ఏర్పాటు చేశారు. వీరితోపాటు ఇద్దరిని కస్టోడియన్‌లుగా నియమించారు.అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ సురేష్‌రెడ్డి తెలిపారు.విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరు కావాలని కోరారు.పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు.

ఫ 21తేదీ వరకు పరీక్షల నిర్వహణ

ఫ 17 కేంద్రాలు ఏర్పాటు

ఫ హాజరు కానున్న 5,627 మంది విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement