దైవాన్ని తోడుగా చేసుకొని ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

దైవాన్ని తోడుగా చేసుకొని ముందుకు సాగాలి

May 15 2026 9:50 AM | Updated on May 15 2026 9:50 AM

త్రిపురారం : ప్రతిఒక్కరూ తమ జీవితంలో దైవాన్ని తోడుగా చేసుకొని ముందుకు సాగాలని, తల్లి, తండ్రి, గరువు, దైవం ఆశీస్సులు ఉన్నప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుందని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. త్రిపురారం మండలంలోని బొర్రాయిపాలెం గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ, 16 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్‌ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డితో కలసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చినజీయర్‌ స్వామి వేంకటేశ్వర స్వామి వైభవం, ఆధ్యాత్మిక విషయాలు, ఆంజనేయస్వామి ప్రవచనాలను చెప్పారు. అంతకుముందు చినజీయర్‌ స్వామికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్‌ బిట్టు వసంతరవికుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, మండల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

ఫ త్రిదండి చినజీయర్‌ స్వామి

Advertisement
 
Advertisement
Advertisement