ఆలేరు: పదో తరగతి ఫెయిలైన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా విద్యాధికారి సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆలేరు పట్టణంలోని పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫెయిలైన విద్యార్థుల కోసం శిక్షణ తరగతులను డీఈఓ ప్రారంభించి మాట్లాడారు. ఒకట్రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులను అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్టు, ఇందు కోసం జిల్లాలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రెగ్యులర్‌గా తరగతులకు పంపించాలని కోరారు. సమ్మర్ క్రీడా శిబిరాల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు చేరవచ్చన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సోషల్ మీడియా ప్రభావానికి గురికాకుండా సమ్మర్ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు.అనంతరం పర్యావరణ పరిరక్షణ అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం, డ్యాన్స్, నాటిక తదితర పోటీల్లో గెలిచిన విద్యార్థులకు డీఈఓ సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల ఆవరణలో ఆయన మొక్కను నాటారు. ఎంఈఓ ఎర్ర లక్ష్మి,జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్, హెచ్‌ఎం దాసరి మంజుల, ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, మేఘరాజు, తిరుపతి, పీడీ పూల నాగయ్య, పీఈటీ కవిత పాల్గొన్నారు.
ఫ డీఈఓ సత్యనారాయణ


