చెరువులో మునిగి బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి బాలుడు మృతి

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

మర్రిగూడ : స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈఘటన శుక్రవారం మర్రిగూడ మండలం దామెరభీమనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన షేక్‌ హరీఫ్‌ నస్రీన్‌లకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు సిద్ధిఖ్‌(11)తో కలిసి గురువారం తన తల్లి మేనమామ కుమారుడి వివాహానికి వెళ్లారు. ఈ క్రమంలో సిద్ధిఖ్‌ తన స్నేహితులతో కలిసి గ్రామంలో గల చెరువు వద్దకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు కాలు జారి నీటమునిగాడు. తోటి స్నేహితులు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు సిద్ధిఖ్‌ను వెతకగా అప్పటికే బయటకు తీసి పరిశీలించగా మృతిచెందాడు. కాగా సిద్ధిఖ్‌ బోడంగిపర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సిధ్ధిఖ్‌ 5వ తరగతి పూర్తి చేసుకున్నాడు. వివాహానికి హాజరై సరదాగా గడుపుతున్న సమయంలో సిద్ధిధఖ్‌ మృతిచెందడం పట్ల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement