యాదగిరిగుట్ట (తుర్కపల్లి): కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి విమర్శించారు. తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంపై ఆగ్రామంలోని రహదారిపై రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, రైతులతో కలిసి రాసారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనకపోవడంపై మండిపడ్డారు. శుక్రవారం వరకు కొనుగోళ్లు ప్రారంభించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతకు ముందు ముల్క లపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించిన సునిత, రామచంద్రారెడ్డిలతో పోలీసులు మాట్లాడారు. కలెక్టర్ వచ్చే వరకు రాస్తారోకో చేస్తామని చెప్పడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ రాస్తారోకోలో మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సాగర్ల పరమేష్, ఎంపీటీసీమాజీ సభ్యుడు గిద్ద కరుణాకర్, భిక్షపతి, ఇమ్మడి మల్లప్ప, రాజేష్‌నాయక్, బుక్యా రవి నాయక్, లక్ష్మణ్ నాయక్, మేకల బాలకృష్ణ, గుంటి శ్రీశైలం, గుగులోతు మోతీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ధాన్యం కొనుగోలులో జాప్యంపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత ఆగ్రహం
ఫ ముల్కలపల్లిలో రైతులతో కలిసి రాస్తారోకో


