యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను వేం నరేందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భవానీ శంకర్ స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, స్థానిక నాయకులున్నారు.


