యాదగిరీశుడి ఆలయంలో 108 మందితో వీణా వాయిద్యం | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి ఆలయంలో 108 మందితో వీణా వాయిద్యం

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో శ్రీనృసింహస్వామి వారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి 108 మంది వీణా వాయిద్యం కళాకారులు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. శ్రీఅన్నమాచార్యులు ద్వాదశ తరము శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల శిష్య బృందం అన్నమయ్య సంకీర్తన సాహిత్య ప్రచార వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పెందుకు యాదగిరి క్షేత్రంలో 108 మంది కళాకారులు వీణా వాయిద్యం చేశారు. మీనాక్షి శ్రీనివాసు నిర్వహణలో తెలుగు రాష్ట్రంలోని కల్యాణి హేమలత, ఉమాదేవి, ప్రశాంతి శిష్య బృందాలు ఈ వేడుకలో పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో 108 మంది కళాకారులు వీణా వాయిద్యం ప్రదర్శించడం ఇదే మొదటి సారి.

Advertisement
 
Advertisement
Advertisement