Fashion Style
-
వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్
ఫ్యాషన్ ప్రపంచంలో అంబానీ వారసురాలు, వ్యాపారవేత్త ఇషా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకున్నారు. ఆధునిక హంగులతో వింటేజ్ గ్లామర్‌ను ప్రదర్శిస్తూ, కార్ల్ లాగర్ఫెల్డ్ 1996 కలెక్షన్‌కు చెందిన అరుదైన ఆర్కైవల్ షానెల్ హాట్ కౌచర్ దుస్తులలో అద్భుతమైన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.వ్యాపార ప్రపంచం నుండి అంతర్జాతీయ కార్యక్రమాలలో రెడ్ కార్పెట్ దాకా, ఇషా అంబానీ శైలి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె తన విలక్షణమైన ఫ్యాషన్ అభిరుచికి మాత్రమే కాకుండా, తన రాజసం ఉట్టిపడే శైలికి కూడా ప్రసిద్ధి చెందారు. ఇటీవల, ఇషా అంబానీ ధరించిన ఒక దుస్తులు చూసి అందరూ 'వావ్' అన్నారు. తాజాగా 90వ దశకపు హాలీవుడ్ గ్లామర్‌ను గుర్తుచేసే ఒక అందమైన బంగారు రంగు వింటేజ్ దుస్తులను ధరించి మోడ్రన్ మహారాణిలా మెరిసారు.2026లో ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సరికొత్త మార్పు కనిపిస్తోంది. పాత తరం నాటి క్లాసిక్ డిజైన్లు (Vintage Couture) మళ్లీ రెడ్ కార్పెట్స్ పైకి వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఇషా అంబానీ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్ రూపొందించిన 'చానెల్ (Chanel) ఆటమ్/వింటర్ 1996 హాట్ కోట్యూర్' కలెక్షన్ నుండి గోల్డ్ కలర్ వింటేజ్ దుస్తులను ధరించారు.ఆమె హిప్స్ వరకు సాగే పూర్తి చేతుల బంగారు రంగు (Gold) 'బంధ్‌గలా' సూట్‌ను ధరించారు. నడుము భాగంలో రత్నాలతో పొదిగిన బెల్ట్‌తో దీనిని స్టైల్ చేశారు. బంగారు రంగు లేస్ క్విల్టెడ్ ప్యాంట్‌సూట్. దీనికి ఆమె టాబ్వింటేజ్ వారి సిగ్నేచర్ గ్రిపాయిక్స్ బెల్ట్‌ను జతచేసింది. ఈ బెల్ట్ ధర సుమారు రూ.31,56,800 ఉంటుంది ఈ లుక్‌లో దాని అద్భుతమైన ఎంబ్రాయిడరీ మరియు ఆకర్షణీయమైన డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ దుస్తులకు బంగారు రంగు డీటైలింగ్‌తో పాటు, రంగురంగుల రాళ్లను అమర్చారు. ఈ లుక్ కోసం ఆమె చానెల్ క్రూయిజ్ 2025/26 కలెక్షన్‌కు చెందిన స్వెడ్ మినీ పౌచ్, మనోలో బ్లాహ్నిక్ శాండల్స్, సెయింట్ లారెంట్ సన్‌గ్లాసెస్‌ను ధరించారు. మేకప్ విషయానికి వస్తే బేక్డ్ న్యూడ్-టోన్డ్ మేకప్, వింగ్డ్ ఐస్, లూజ్ హెయిర్‌తో సింపుల్‌గా కనిపించారు. 2011లో లేడీ గాగా 1996 నాటి అరుదైన షానెల్ గోల్డ్ ప్యాంట్‌సూట్‌ను ధరించారు. అంతేనా సెయింట్ లారెంట్ వారి SL M161 సన్‌గ్లాసెస్ మరో ప్రత్యేకత. వీటి ఖరీదు సుమారు దాదాపు రూ. 32,000 ఉంటుందని అంచనా. షానెల్ బ్రాండ్‌కు చెందిన క్రూజ్ 2025/26 కలెక్షన్లోని ఒక స్టైలిష్ స్వెడ్ మినీ పౌచ్‌ను ధరించారు. తన లుక్‌ను పూర్తి చేయడానికి, ఆమె లగ్జరీ బ్రాండ్ మనోలో బ్లానిక్కు చెందిన కల్లాస్లీ 90 లెదర్ స్లింగ్బ్యాక్ శాండల్స్‌ను ధరించారు. సుమారు రూ. 1,29,156 ఖరీదు చేసే ఈ స్టైలిష్ హీల్స్, ఆమె మొత్తం లుక్కు మరింత రాజసం ఉట్టిపడేలా చేశాయి.రాజసం ఉట్టిపడే, ఆకర్షణీయమైన లుక్‌ను చాలా హుందాగా తీర్చిదిద్దుకోవడంతోపాటు, తన మొత్తం లుక్కు మరింత క్లాసీ లుక్‌ను జోడించారు. ఇషా తన గ్లామరస్ దుస్తులకు తగ్గట్టుగాఎంచుకున్న తేలికపాటి మేకప్ ఆమె లుక్కు చక్కగా సరిపోయింది. ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset) -
మెట్ గాలా 2026 అనన్యా బిర్లా లుక్ : ఫ్యాషన్ వరల్డ్ షాక్!
ప్రముఖ వ్యాపారవేత్త వారసురాలు, గాయని, స్వయంగా వ్యాపారవేత్త అనన్య బిర్లా తన తొలి మెట్ గాలా 2026 ఈవెంట్ అరంగేట్రంలో ఫ్యాషన్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ డ్రెస్‌తో అదర గొట్టేశారు. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, సరికొత్త అర్థాన్నివ్వడం విశేషంగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు మరింత వైరల్‌గా మారాయి. రెడ్ కార్పెట్ అనగానే సాధారణంగా సిల్క్ , వెల్వెట్ గౌన్లతో నిండి ఉంటాయి. కానీ అనన్య బిర్లా మెట్ గాలా 2026లో ఈ ట్రెండ్‌ను మార్చేశారు. ఏకంగా స్టెయిన్లెస్ స్టీల్‌తో చేసిన గౌను ధరించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అందుకే ఆ డ్రెస్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదని, అది ఒక శక్తివంతమైన భావప్రకటనా రూపమని ఆమె లుక్ నిరూపించింది.స్టెయిన్లెస్ స్టీల్ డ్రెస్ ప్రత్యేకతఅనన్య ధరించిన ‘ధరించగలిగే శిల్పం’ (Wearable Sculpture) ఒక అద్భుతమైన కళాఖండంగా నిలిచింది. దీనికి స్టెయిన్లెస్ స్టీల్‌ను ఉపయోగించి 'క్రోమ్ ఫినిషింగ్' తో తయారు చేశారు. దీంతో ఆమె ఒక ఆధునిక దేవతలా లేదా శక్తివంతమైన యోధురాలిలా మెరిసిపోయారు.ఈ డ్రెస్ భుజాల భాగం ఎంతో ధీమాగా, ఆర్కిటెక్చరల్ శైలిలో రూపొందించబడింది. ఇది ఆమె వ్యక్తిత్వంలోని బలాన్ని ప్రదర్శిస్తోంది.ఈ మెటల్ డ్రెస్ ఒక 'కవచం' (Armor) లాగా కనిపిస్తూ.. ఒక వ్యక్తి తన అస్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం నుండి ఎలా కాపాడుకుంటారో తెలియజేస్తుంది. View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)ఈ డ్రెస్ డిజైనర్లుబాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ రియా కపూర్ (Rhea Kapoor) దార్శనికతతోనే ఈ అవుట్‌ఫిట్ ఇంత పవర్‌ఫుల్‌గా తయారైందట. అంతర్జాతీయంగా పేరు గాంచిన ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రాబర్ట్ వున్ (Robert Wun), నిత్యావసర వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టించే భారతీయ సమకాలీన కళాకారుడు సుబోధ్ గుప్తా (Subodh Gupta) సమన్వయంతో దీన్ని రూపొందించారు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)అనన్య బిర్లా గురించి క్లుప్తంగాఅనన్య బిర్లా ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె. అనన్య ఆర్సిబి ఫ్రాంచైజీ కొత్త యజమాని ఆర్యమాన్ బిర్లా సోదరి కూడా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్, మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశారు. 17 ఏళ్ల వయసులో 'స్వతంత్ర'ను స్థాపించి, గ్రామీణ మహిళలకు అండగా నిలుస్తున్నారు. బిర్లా గ్రూప్ కంపెనీల బోర్డులలో కూడా ఉన్నారు. 'లివిన్ ది లైఫ్', 'మీంట్ టు బి' వంటి ప్రసిద్ధ ఆల్బమ్‌లతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గాయని. మానసిక ఆరోగ్యంపై అవగాహన, ఆ సమస్యలతో బాధపడుతోన్న వారికి నిపుణులచే కౌన్సెలింగ్ ఇప్పించే లక్ష్యంతో అమ్మతో కలిసి ‘Mpower’ అనే సంస్థ ని స్థాపించి సేవలందిస్తున్నారు. ఇటీవల ‘బిర్లా స్టూడియోస్’ పేరుతో సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వేదికగా యువ ప్రతిభను ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటున్నారు.ఆమె నికర విలువసుమారు రూ.1,800 కోట్లు ఉంటుందని అంచనా. ఇదీ చదవండి: విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా? -
Summer లేస్ బ్రైట్ఫుల్
వేసవిలో కంఫర్ట్గానూ,స్టైలిష్‌గానూ ఉండే ఔట్ఫిట్స్ జాబితాలో కూల్‌గా మన మదిని చుట్టేస్తుంది క్రోచెట్ లేస్ డ్రెస్సింగ్ స్టైల్. ఎప్పుడూ ఎవర్గ్రీన్ అనిపించుకునే ఈ క్రియేటివ్ వర్క్‌ని ఏ ఫ్యాబ్రిక్‌తోనైనా జత చేస్తే రిచ్ లుక్‌ని మన సొంతం చేస్తుంది.క్యాజువల్ లేదా పార్టీవేర్‌గా ఇట్టే మార్కులు కొట్టేస్తుంది.బ్రైడల్ వేర్‌గా యూనివర్సల్ సింబల్‌ని సొంతం చేసుకున్న ఈ అల్లికల అందం ఈ వేసవికి మగువల ముస్తాబులో రెక్కలకు రంగులు అద్దుకున్న రాయంచలా మరింతగా మెరిసిపోతుంది.సంప్రదాయ హంగులుక్రోచెట్ లేస్ అత్యంత సున్నితమైన, క్లిష్టమైన వర్క్. సంప్రదాయ అల్లిక కావడంతో ఈ వర్క్ ఎవర్‌గ్రీన్‌గా అందరి మన్ననలు అందుకుంటుంది. కాటన్, సిల్క్, చందేరీ, నెటెడ్... ఏ ఫ్యాబ్రిక్‌తో అయినా ఇట్టే జత కట్టే క్రోచెట్ లేస్‌లో సంప్రదాయ పద్ధతిలో హ్యాండ్మేడ్గానూ, అధునాతనంగా మిషనరీపైనా రూపు దిద్దుకుంటుంది. ఇండో–వెస్ట్రన్గానూ..వెస్ట్రన్ గౌన్స్, టాప్స్, మిడీస్.. ఇండోవెస్ట్రన్ శైలులు క్రోచెట్ లేస్ మోడల్ డ్రెస్సుల ద్వారా మనం చూడచ్చు. కాటన్, సిల్క్దారాలతో తయారయ్యే ఈ అల్లికల ఫ్యాబ్రిక్‌లో పువ్వులు, తీగలు, లతల డిజైన్లు కనిపిస్తాయి. లేతరంగులు, ముఖ్యంగా తెలుపులో ఎక్కువగా కనిపించే ఈ డ్రెస్సులు సమ్మర్ స్పెషల్‌గానూ యువతను ఆకట్టుకుంటున్నాయి.వెస్ట్రన్ బ్రైడ్స్ ధరించే పొడవాటి తెల్లని గౌన్లతో మనల్ని ఆకట్టుకుంటుంది క్రోచెట్ లేస్. మన సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలలోనూ నవ వధువులు లేస్ డిజైనరీ దుస్తులు ధరించడం చూస్తే కదలాడుతుండే హంసలు కళ్ల ముందు నిలుస్తాయి. క్యాజువల్ వేర్‌గానూ, చీరలు, లెహంగాలు, కుర్తా, దుపట్టా.. వంటి డ్రెస్సులకు, క్రొచెట్ లేస్ అందమైన అలంకరణగా విరాజిల్లుతుంది. క్రోచెట్ లేస్తో అంచులు, డెకరేటివ్ ప్యాచ్ లేదా మొత్తం దుపట్టా, శారీగానూ ఆకట్టుకుంటుంది. లేస్ ఆభరణాలుముచ్చటైన కంఠాభరణాలు, పర్సులు, హ్యాండ్ కఫ్స్, షూ డిజైన్స్‌లోనూ డిజైనర్లు లేస్తో క్రియేటివ్ డిజైన్స్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. నాణ్యతను బట్టి వందల రూపాయల నుంచి డిజైన్‌ను బట్టి వేలల్లోనూ ఈ డిజైన్స్ ధర పలుకుతున్నాయి. -
తరగని అందం ప్రణీత సొంతం....కలర్ ఫుల్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్ (ఫోటోలు)
-
గోవాబీచ్లో, సాయం సంధ్యలో.. మలైకా సన్‌బాత్
నటి మలైకా అరోరా జీవన శైలి ఫ్యాషన్ తీరు తెన్నుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆశించదగిన వార్డ్రోబ్ కలెక్షన్, ఫ్యాషన్ స్టైల్‌కు ఫిదా కాని ఫాలోయర్లు, అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాజాగా గోవాలో హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట హల్చల్ చేస్తున్నాయిమలైకా అరోరా గోవాలో సేదతీరుతోంది. ఆల్-వైట్ కో-ఆర్డ్ సెట్లో సన్‌సెట్ టైంలో ఎరుపు పసుపు కలగలిసిన సూర్యాస్తమయ ఛాయలో అందంగా మెరిసింది. నడుము చుట్టూ సెమీ-షీర్ ఆఫ్-షోల్డర్ బ్లౌజ్ ,మెర్మైడ్-ఫిట్ స్కర్ట్‌తో, బీచ్‌సైడ్ స్టైల్లో కనిపించింది. ఈ దృశ్యాలు ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నాయి. అంతకుముందు కూడా ఇటీవల సుప్రియా ముంజా డిజైన్ చేసిన ఐవరీ గౌనును ధరించి ఆకట్టుకుంది. మలైకా అరోరా అన్ని సీజన్లలోనూ వైట్ కలర్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. మరో సందర్బంలో వన్షోల్డర్లో గౌన్‌లో కనిపించి ఫ్యాన్స్ కళ్లను తనవైపు తిప్పుకుంది. వన్ సైడ్ కటౌట్ డిజైన్ ఈ డ్రెస్ హైలైట్. అంతేకాదు మలైకాఅరోరా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. యోగాసనాలు, జిమ్‌లో వర్కౌట్లతో తన బాడీని ఫిట్‌గా ఉంచుకుంటుంది. ముఖ్యంగా సన్‌బాత్ తన ఫిట్నెస్ అండ్ సీక్రెట్ అని కూడా చెప్పవచ్చు.సన్బాత్లేలేత సూర్యకిరణాలతో డి విటమిన్ లభిస్తుంది. మితంగా సూర్యరశ్మి మన శరీరానికి తాకేలాగా సూర్యరశ్మి కాంతికి పడుకొని దానిని ఆస్వాదించడాన్ని సన్ బాత్ అంటారు. దీని వల్ల శరీరం చురుగ్గా ఉండేలా చేస్తుంది. సన్ బాత్ రెగ్యులర్‌గా చేస్తే వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు. చర్మంపై ముడతలు మచ్చలు తగ్గిపోతాయి. దీనివల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఒత్తిడి తొలగి, మంచి నిద్ర పడుతుంది. మంచి శక్తి వస్తుంది. ఉదయం వేళల్లోగానీ, సాయం సంధ్యవేళ గానీ సూర్యునికి ఎదురుగా నిలబడి వ్యాయమాలు చేయడం, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.మరోవైపు దాదాపు అయిదేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకున్న లవ్‌బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా ఇటీవలే బ్రేకప్ చెప్పున్నట్టు ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఒకే చోట కనిపించారు. దీంతో ఈ జంట మళ్లీ కలిసిపోయిందా అని పుకార్ల తెర లేచింది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ దుండగుల కత్తిపోట్లకు గురై, ఆస్పత్రిలో చేరాడు. ఈ సమయంలో సైఫ్‌ను పరామర్శించేందుకు అర్జున్ కపూర్, మలైకా అరోరా కలిసి రావడం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి విదితమే. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) చదవండి: తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?గొంతులో గర గర వేధిస్తోందా? ఈ చిట్కాలతో ఉపశమనం -
ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమయానికి తగ్గట్టుగా డ్రెస్‌లను ఎంపిక చేసుకోవడంలో, ఫ్యాషన్‌ను, బిజినెస్‌ను మిళితం చేయడంలో నీతా తరువాతే ఎవరైనా అనేది అభిమానుల మాట మాత్రమే కాదు, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కూడా. తాజా ఐపీఎల్ -2025 వేలం సందర్భంగా మరోసారి తన స్టైల్‌తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. నీతా అంబానీ నేవీ బ్యూ ప్యాంట్‌సూట్ ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు ఆ డ్రెస్ ధర కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ వైడ్-లెగ్ ప్యాంట్, బ్లూ సూట్లో హుందాగా కనిపించారు. నీతా ధరించిన ‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ బ్రేజర్ సూట్ ధర అక్షరాలా 950 డాలర్లు. అంటే దాదాపు రూ.78 వేలు. ఇందులో బ్లేజర్ రూ. 47 వేలు కాగా వైడ్-లెగ్ ట్వీడ్ ట్రౌజర్ ధర సుమారు రూ. 31వేలు, మొత్తంగా ఆమె సూట్ ధర రూ.78 వేలు. అంతేనా వజ్రాలు పొదిగిన ఎంఐ బ్రూచ్, హ్యాండ్‌బ్యాగ్, డైమండ్ రింగ్, డైమండ్ చెవిపోగులు, సన్ గ్లాసెస్, వాచ్, హీల్స్ ఇలా అన్నీ ప్రత్యేకంగా కనిపించడం విశేషం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)nbsp;ఐపీఎల్ మెగా వేలం-2025 తొలి రౌండ్ విడత ప్రక్రియ దుబాయ్‌లోని జెడ్డాలో ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఐ నలుగురు సూపర్ స్టార్లు రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతోపాటు టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకూడా ఉన్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మను రూ.8 కోట్లకు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వేలంలో నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. -
డిఫరెంట్ స్టైలిష్ లుక్స్‌తో దేవర భామ.. ఫోటోలు
-
ప్యారిస్ ఒలింపిక్స్ : ఫ్యాషన్ ఐకాన్‌గా నీతా ఫోటోలు వైరల్
రిలయన్స్ షౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని చాటుకోవడంలో ఎపుడు తన అభిమానుల అంచనాలను తప్పరు. ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో అందర్నీ అబ్బుర పర్చిన నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా స్టైల్ ఐకాన్‌గా నిలిచారు.ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో నీతా అంబానీ హుందాగా కనిపించారు లోటస్ పింక్ హ్యాండ్-ఎంబ్రాయిడరీ చీరలో నీతా దేశీ శోభను ప్రదర్శించారు. ఫ్యాషన్ సీటీలో జరుగుతున్న విశ్వ క్రీడావేదికపై చీర పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. భారతీయ సంప్రదాయన్ని, హస్తకళ గొప్ప కళాత్మకతను చాటడమే కాదు, అద్భుతమైన చీరలో ఫ్యాషన్ ప్రియులను నీతా ఆకర్షించారు. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.సున్నితమైన సోజ్నీ కలంకారి చేతి ఎంబ్రాయిడరీతో కస్టమ్ మేడ్ చీర, చీరకు సరిపోయే హాఫ్-స్లీవ్ బ్లౌజ్లో అద్భుతమైన ఛాయతో మెరిసారు. అంతేనా లగ్జరీ బహుళ-లేయర్డ్ ముత్యాల నెక్లెస్, చెవిపోగులు, అద్భుతమైన డైమండ్ రింగ్ , మ్యాచింగ్ ముత్యాల గాజుల సెట్‌ను ధరించారు. -
మెరుపు తీగలా మెరుస్తున్న ఈ ష్యాషన్ క్వీన్‌ని చూశారా? (ఫొటోలు)
-
Sreemukhi: రెక్కలు తొడిగిన ముద్దబంతిలా శ్రీముఖి స్టయిల్ (ఫోటోలు)


