ప్రముఖ వ్యాపారవేత్త వారసురాలు, గాయని, స్వయంగా వ్యాపారవేత్త అనన్య బిర్లా తన తొలి మెట్ గాలా 2026 ఈవెంట్ అరంగేట్రంలో ఫ్యాషన్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రెస్‌తో అదర గొట్టేశారు. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, సరికొత్త అర్థాన్నివ్వడం విశేషంగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు మరింత వైరల్‌గా మారాయి.
రెడ్ కార్పెట్ అనగానే సాధారణంగా సిల్క్ , వెల్వెట్ గౌన్‌లతో నిండి ఉంటాయి. కానీ అనన్య బిర్లా మెట్ గాలా 2026లో ఈ ట్రెండ్‌ను మార్చేశారు. ఏకంగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన గౌను ధరించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అందుకే ఆ డ్రెస్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదని, అది ఒక శక్తివంతమైన భావప్రకటనా రూపమని ఆమె లుక్ నిరూపించింది.
స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రెస్ ప్రత్యేకత
అనన్య ధరించిన ‘ధరించగలిగే శిల్పం’ (Wearable Sculpture) ఒక అద్భుతమైన కళాఖండంగా నిలిచింది. దీనికి స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగించి 'క్రోమ్ ఫినిషింగ్' తో తయారు చేశారు. దీంతో ఆమె ఒక ఆధునిక దేవతలా లేదా శక్తివంతమైన యోధురాలిలా మెరిసిపోయారు.
ఈ డ్రెస్ భుజాల భాగం ఎంతో ధీమాగా, ఆర్కిటెక్చరల్ శైలిలో రూపొందించబడింది. ఇది ఆమె వ్యక్తిత్వంలోని బలాన్ని ప్రదర్శిస్తోంది.
ఈ మెటల్ డ్రెస్ ఒక 'కవచం' (Armor) లాగా కనిపిస్తూ.. ఒక వ్యక్తి తన అస్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం నుండి ఎలా కాపాడుకుంటారో తెలియజేస్తుంది.
ఈ డ్రెస్ డిజైనర్లు
బాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ రియా కపూర్ (Rhea Kapoor) దార్శనికతతోనే ఈ అవుట్‌ఫిట్ ఇంత పవర్‌ఫుల్‌గా తయారైందట. అంతర్జాతీయంగా పేరు గాంచిన ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రాబర్ట్ వున్ (Robert Wun), నిత్యావసర వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టించే భారతీయ సమకాలీన కళాకారుడు సుబోధ్ గుప్తా (Subodh Gupta) సమన్వయంతో దీన్ని రూపొందించారు.
ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా
అనన్య బిర్లా గురించి క్లుప్తంగా
అనన్య బిర్లా ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె. అనన్య ఆర్‌సిబి ఫ్రాంచైజీ కొత్త యజమాని ఆర్యమాన్ బిర్లా సోదరి కూడా. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 17 ఏళ్ల వయసులో 'స్వతంత్ర'ను స్థాపించి, గ్రామీణ మహిళలకు అండగా నిలుస్తున్నారు. బిర్లా గ్రూప్ కంపెనీల బోర్డులలో కూడా ఉన్నారు. 'లివిన్ ది లైఫ్', 'మీంట్ టు బి' వంటి ప్రసిద్ధ ఆల్బమ్‌లతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గాయని. మానసిక ఆరోగ్యంపై అవగాహన, ఆ సమస్యలతో బాధపడుతోన్న వారికి నిపుణులచే కౌన్సెలింగ్ ఇప్పించే లక్ష్యంతో
అమ్మతో కలిసి ‘Mpower’ అనే సంస్థ ని స్థాపించి సేవలందిస్తున్నారు. ఇటీవల ‘బిర్లా స్టూడియోస్’ పేరుతో సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వేదికగా యువ ప్రతిభను ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటున్నారు.ఆమె నికర విలువసుమారు రూ.1,800 కోట్లు ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?


