మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
తాజాగా ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు డ్రాగన్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఓ కీలకమైన పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారు.


