అందాల తార పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా హాజరైన 'ఫస్ట్ టైమ్' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్, సాంగ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది.
ఈ సినిమా ద్వారా పాయల్ రాజ్‌పుత్ ప్రియుడు సౌరబ్ ధింగ్ర హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
హేమంత్ ఇప్పలపల్లి దర్శక-నిర్మాతగా, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకుండా కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో అత్యున్నత వీఎఫ్ఎక్స్ (VFX) విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తదితరులు హాజరైన ఈ వేడుకలో 'ఈ పిల్ల నేను అనుకోనేలేదు' సాంగ్ మరియు ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది.


