కొత్తవాళ్లతో నిర్మాత అనిల్ సుంకర సినిమా.. ఫన్నీగా ప్రకటన | Anil Sunkara New Movie Airforce Bezawada Batch Movie | Sakshi
Sakshi News home page

Anil Sunkara: డిఫరెంట్‌గా కొత్త మూవీ ప్రకటన.. పోస్టర్ రిలీజ్

Jan 26 2026 9:20 PM | Updated on Jan 26 2026 9:20 PM

Anil Sunkara New Movie Airforce Bezawada Batch Movie

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర.. ఇటీవల మూవీ మేకింగ్ రియాలిటీ షో 'షో టైమ్-సినిమా తీద్దాం రండి' ప్రకటించారు. టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ విజన్‌ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు తొలి ప్రకటన చేశారు. ఏటీవీ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై  కొత్త నటీనటులతో రూపొందే సినిమాకు 'ఎయిర్‌ఫోర్స్‌ బెజవాడ బ్యాచ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఫన్నీ పోస్టర్ రిలీజ్ చేశారు.

విజయవాడ నేపథ్యంగా సాగే ఈ చిత్రం.. నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితంలోని సంఘటనలు ఆధారంగా తీస్తున్నారు. వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో కష్టాలను దాటి ముందుకు సాగుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి చివరికి ఎలా సక్సెస్ అయ్యారు అనేది స్టోరీ. విజయవాడలోని ఓ ప్రముఖ జంక్షన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌లో సరదాగా, మట్టివాసనతో కూడిన సందేశంతో బ్యానర్ ఇప్పడు అందరిని ఆకట్టుకుంది.

'అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు' అంటూ రూపొందించిన ఈ బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement