ఈనెల 30వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న తెలుగు సినిమా 'త్రిముఖ'. ఇది ఇప్పుడు విడుదలకు ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మైలురాయిని నమోదు చేయబోతోంది. ఈ చిత్రాన్ని కొత్త హీరోతో తీశారు. అయినా సరే అత్యధికంగా 500 థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకున్న 'త్రిముఖ'... ప్రేక్షకుల అంచనాలను మించేలా బాక్సాఫీస్ వద్ద ప్రభావవంతమైన విజయాన్ని నమోదు చేస్తూ.. ఒక కొత్త హీరోకు ఘనమైన ఆరంభాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో సన్నీ లియోన్, అషూ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.


