ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం లాంటి తెలుగు చిత్రాలతో పాటు ప్రతిఛాయ, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా అన్నట్లు ఓ తెలుగు సినిమా సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటది? ఎందులో అందుబాటులో ఉంది?
(ఇదీ చదవండి: కుడివైపు గుండె.. నీలం రంగు శరీరం.. 'చిరంజీవి' గ్లింప్స్)
అనుదీప్, అజయ్ కుమార్, వేద్విక తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'మత్తురా'. గతేడాది సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. పరిమిత బడ్జెట్, నటీనటులు కొత్తవాళ్లు కావడంతో ఇదొచ్చి వెళ్లిన సంగతి కూడా ఆడియెన్స్‌కి తెలీదు. ఇప్పుడీ మూవీ ఏడు నెలల తర్వాత స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో అందుబాటులో ఉంది.
'మత్తురా' విషయానికొస్తే.. నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ ఇది. మద్యం అలవాటు వారి జీవితాలని ఎలా నాశనం చేసింది? ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొనేలా చేసింది అనే అంశాలతో అడ్వెంచరస్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. పువ్వాళ చలపతి దర్శకత్వం వహించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)


