అల్లు అర్జున్-‍అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్! | Allu Arjun Atlee Movie Dubai Schedule Cancelled | Sakshi
Sakshi News home page

Allu Arjun: ఓవైపు గుడ్ న్యూస్.. మరోవైపు బ్యాడ్ న్యూస్

Mar 31 2026 8:32 PM | Updated on Mar 31 2026 8:32 PM

Allu Arjun Atlee Movie Dubai Schedule Cancelled

అల్లు అర్జున్ పుట్టినరోజు దగ్గరకొచ్చేసింది. దీంతో అట్లీతో చేస్తున్న మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే స్పెషల్ పోస్టర్‌తో పాటు టైటిల్ ప్రకటన ఉంటుందని టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు బయటపెట్టారు. ఇదొచ్చిందని ఆనందించేలోపు మూవీ టీమ్‌కి ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఎదురైనట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా.. తెలుగులోనూ)

ఏప్రిల్ 8న ‍బన్నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుని.. తర్వాత దుబాయిలో కొత్త షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ యుద్ధ ప్రభావం ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలపై బలంగా ఉంది. మరీ ముఖ్యంగా దుబాయిలో ఎప్పటికప్పుడు ఏదో బాంబు పేలుతూనే ఉన్నట్లు ఎప్పటికప్పుడు వార్తలొస్తున్నాయి. దీంతో దుబాయి షెడ్యూల్‌ని రద్దు చేశారట. మరి వేరే దేశానికి ఏమైనా దీన్ని షిఫ్ట్ చేస్తారా? లేదంటే పరిస్థితులు సద్దుమణిగాక దుబాయిలోనే చిత్రీకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటివరకు అయితే ముంబైలోనే వేసిన సెట్స్‌లో అల్లు అర్జున్, దీపికా పదుకొణెలపై చాలావరకు సీన్స్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా, థియేటర్లలోకి రావొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు షూటింగ్ రద్దవడం లాంటి వార్తలు చూస్తుంటే.. థియేటర్లలోకి రావడం మరింత ఆలస్యమవుతుందా అనిపిస్తుంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా తమిళ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్-నీల్ సినిమాలో నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement