ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా | My Lord Movie OTT Telugu Streaming Now | Sakshi
Sakshi News home page

My Lord OTT: తమిళ సోషల్ డ్రామా మూవీ.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ

Mar 31 2026 5:24 PM | Updated on Mar 31 2026 5:28 PM

My Lord Movie OTT Telugu Streaming Now

తెలుగులో దాదాపుగా కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. కాస్త డిఫరెంట్ చిత్రాలు చూద్దామనుకుంటే మన ప్రేక్షకులు చాలామంది తమిళ, మలయాళం వైపు చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయా ఇండస్ట్రీల నుంచి ఎప్పటికప్పుడు భిన్నమైన మూవీస్ వస్తుంటాయి. ఇవి ఓటీటీలోకి వచ్చిన తర్వాత మన దగ్గర ఆదరణ బాగుంటుంది. ఇప్పుడు కూడా అలా ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి సైలెంట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2')

గతేడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో హిట్ కొట్టిన తమిళ నటుడు శశికుమార్ లేటెస్ట్ తమిళ మూవీ 'మై లార్డ్'. పొలిటికల్ సెటైరికల్ కాన్సెప్ట్‌తో తీసిన సోషల్ డ్రామా చిత్రమిది. చైత్ర ఆచార్ హీరోయిన్ కాగా రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైంది. మార్చి 20 నుంచి తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు, హిందీ కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చాయి. కాస్త డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.

'మై లార్డ్' విషయానికొస్తే.. అనాథలైన ముత్తుసిరిపి(శశికుమార్), సుశీల (చైత్ర ఆచార్) అగ్గిపెట్టెల కంపెనీలో పనిచేస్తుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఓరోజు గుడికి వెళ్లిన సుశీల కళ్లుతిరిగి పడిపోతుంది. ఆస్పత్రికి తీసుకెళ్తే ఏకంగా రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతారు. అలానే తమకు తెలియకుండానే తమ శరీరంలోని కిడ్నీలు దొంగిలించారని వీళ్లకు తెలుస్తుంది. వీళ్లిద్దరూ చనిపోయారని ఏకంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ కేంద్రమంత్రికి కిడ్నీ దానం చేయాలని కొందరు వీళ్లని బలవంతపెడుతూ ఉంటారు. దీంతో ఓ చిన్న జర్నలిస్టు సాయంతో ముత్తుసిరిపి, సుశీల.. తమకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాడారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

థియేటర్లలో రిలీజైనప్పుడు మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అవకాశముంది. హీరో సూర్య.. తన బ్యానర్‌పై 'మై లార్డ్'ని సమర్పించడం విశేషం. సెకండాఫ్‌లో కొన్ని అనవసర సీన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా బాగుందనే టాక్ వినిపిస్తోంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement
 
Advertisement
Advertisement