పవన్ కళ్యాణ్ 'పురుష' షూటింగ్ పూర్తి | Pawan Kalyan Purusha Movie Shooting Completed, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ 'పురుష' షూటింగ్ పూర్తి

Oct 2 2025 4:10 PM | Updated on Oct 2 2025 5:16 PM

Pawan Kalyan Purusha Movie Shooting Completed

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ఓ డిఫరెంట్ కామెడీ మూవీ తీస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని తెలుగు తెరకు పరిచయం చేస్తూ 'పురుష' అనే సినిమాను నిర్మిస్తున్నారు. వీరు ఉలవల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ డైరెక్టర్ ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రంలో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమా వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు హీరోయిన్లు. తాజాగా ఓ ప్రత్యేక గీతం పూర్తి చేసి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement