చాందినీ చౌదరి కొత్త సినిమా గ్రాండ్‌ లాంచ్ | Chandini Chowdary New Telugu Movie | Sakshi
Sakshi News home page

చాందినీ చౌదరి కొత్త సినిమా గ్రాండ్‌ లాంచ్

Nov 2 2025 7:24 PM | Updated on Nov 2 2025 7:24 PM

Chandini Chowdary New Telugu Movie

చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా మొదలైంది. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్‌లో దీన్ని తెరకెక్కించనున్నారు. వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం (నవంబరు 02) ఘనంగా లాంచ్ అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాప్ కొట్టగా, గీతా భాస్కర్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సైన్స్ ఫిక్షన్, డార్క్ కామెడీతో పాటు ఈ చిత్రంలో ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈ చిత్ర కాన్సెప్ట్ వీడియోను టీమ్ త్వరలోనే విడుదల చేయనుంది. నవంబర్ చివరిలో హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో జీవన్ కుమార్, అజయ్ గోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తుండగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement