ప్రస్తుతం తెలుగు దర్శకనిర్మాతలు తమిళ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే.. తమిళ హీరోలు కూడా తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో శివకార్తికేయన్, ధనుష్, విజయ్ తదితరులు తెలుగు దర్శకులతో మూవీస్ చేశారు. సూర్య కూడా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాధ్ అండ్ సన్స్'లో నటించారు. ఇది త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
ఇకపోతే సూర్య తమ్ముడు కార్తీ ఇంతకు ముందే నాగార్జునతో కలిసి 'ఊపిరి'లో నటించారు. ఆ చిత్రం తమిళంలో తోళా పేరుతో విడుదలయ్యింది. కార్తీ ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో కలిసి పని చేస్తున్నాడు. ప్రస్తుతం సర్ధార్ 2 పూర్తి చేసిన ఇతడు.. తమిళ్ దర్శకత్వంలో 'మార్షల్'లో నటిస్తున్నాడు. దీని తరువాత తెలుగు దర్శకుడు కల్యాణ్ శంకర్ తీస్తున్న ద్విభాషా చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయని ఇందులో కార్తీకి జంటగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నట్లు తెలిసింది. యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి సంబంధించిన వివరాలను ప్రస్తుత తమిళ రాజకీయ పరిస్థితులు కారణంగా వెల్లడించలేదని తెలిసింది. ఈ సినిమా డీటైల్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా)


