'ది రెడ్ బ్యాగ్' టీజర్ విడుదల | Red Bag Movie Teaser Telugu | Sakshi
Sakshi News home page

'ది రెడ్ బ్యాగ్' టీజర్ విడుదల

Jun 21 2026 9:13 PM | Updated on Jun 21 2026 9:13 PM

Red Bag Movie Teaser Telugu

హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం 'ది రెడ్ బ్యాగ్'. రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఆదివారం చిత్ర టీజర్‌ని ఏపీ మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్‌డేట్.. ఆ డైరెక్టర్‌ని పవన్ పక్కనబెట్టేశారా?)

నలుగురు అమ్మాయిల జీవితం ఓ రెడ్ బ్యాగ్ వల్ల తలకిందులు అవుతుంది. అసలు ఆ రెడ్ బ్యాగ్‌లో ఏముంది? అమ్మాయిలకి ఆ బ్యాగ్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆ రెడ్ బ్యాగ్‌తో మాఫియాకి ఉన్న లింక్ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ ఉంది. నలుగురు హీరోయిన్స్ ఎంత గ్లామరస్‌గా కనిపిస్తున్నారో.. అంత వయలెంట్‌గా తెరపై విధ్వంసం చేసినట్టు అనిపిస్తోంది. శేఖర్ మోపురి సంగీతమందించారు. త్వరలో చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరో 'బాహుబలి')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement