కుమారస్వామి కథతో సినిమా.. టైటిల్ ఫిక్సయిందా? | Ntr Trivikram Movie Titled Shanmukudu Based On Kumaraswami Story | Sakshi
Sakshi News home page

NTR Trivikram: పుట్టినరోజుని టైటిల్ రివీల్ చేయనున్నారా?

Apr 14 2026 12:57 PM | Updated on Apr 14 2026 1:16 PM

Ntr Trivikram Movie Titled Shanmukudu Based On Kumaraswami Story

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' చేస్తున్నాడు. లెక్క ప్రకారం ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాలి. కానీ ఇప్పట్లో రావడం కష్టమే అనిపిస్తుంది. ఒకవేళ వచ్చేలా ఉంటే దానికి తగ్గట్లు రూమర్స్, హింట్స్ వచ్చేవి. అలాంటివేం లేవంటే వచ్చే ఏడాదే థియేటర్లలోకి రావొచ్చేమో అనిపిస్తుంది. వచ్చే నెలలో బయటకొచ్చే గ్లింప్స్, ఫస్ట్ లుక్ బట్టి రిలీజ్‌పై క్లారిటీ రావొచ్చు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

తారక్ పుట్టినరోజునే మరో ప్రాజెక్టుపై కూడా పూర్తి క్లారిటీ వచ్చేలా కనిపిస్తుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో కొన్నాళ్ల క్రితం ఓ సినిమాని ప్రకటించారు. కుమారస్వామి కథతో దీన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం వెంకటేశ్‌తో 'ఆదర్శ కుటుంబం' తీస్తున్న దర్శకుడు త్రివిక్రమ్.. ఇది పూర్తవగానే ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాపై దృష్టి పెట్టనున్నారు. అయితే ఈ చిత్రానికి 'షణ్ముఖుడు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే నాడు ఈ టైటిల్ ప్రకటించొచ్చని టాక్.

ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ అయితే తారక్‌తో సినిమాలు చేయడం పక్కా. తర్వాత లైనులో ఎవరున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపించింది కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇ‍ప్పుడు వినిపిస్తున్న రూమర్స్ అన్నింటికీ తారక్ పుట్టినరోజున క్లారిటీ ఇస్తారేమో చూడాలి?

(ఇదీ చదవండి: తెలుగు బిగ్‌ పాన్‌ ఇండియా సినిమాలో అలియా భట్‌)

Advertisement
 
Advertisement
Advertisement