అమెరికన్ నటి.. తెలుగు దర్శకుడు.. పాన్ ఇండియా సినిమా | M4M Telugu Movie Release Date | Sakshi
Sakshi News home page

అమెరికన్ నటి.. తెలుగు దర్శకుడు.. పాన్ ఇండియా సినిమా

Apr 6 2026 10:36 PM | Updated on Apr 7 2026 12:44 AM

M4M Telugu Movie Release Date

ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎం4ఎం' (M4M – Motive for Murder) సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పాన్ ఇండియా వైడ్ ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందించారు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని)

భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తోంది. అమెరికాలో విడుదల బాధ్యతలను TekFlix Entertainment, ఉత్తర భారత విడుదలను JVEL Entertainment సంస్థలు తీసుకున్నాను. విడుదలకు ముందే ఈ మూవీ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పలాసిస్ సీ థియేటర్‌లో ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా, ముంబైలోని IMPPA ప్రివ్యూ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. దీనికి మంచి స్పందన లభించింది.

ఇక హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్‌లో విస్తృతంగా నిర్వహించిన ప్రమోషన్ టూర్.. సినిమాకు మరింత ప్రచారం తీసుకువచ్చింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, థ్రిల్లింగ్ స్టోరీ, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.  

(ఇదీ చదవండి: ఆరు రోజుల్లో బర్త్‌ డే.. బుల్లితెర నటి బలవన్మరణం)

Advertisement
 
Advertisement
Advertisement