సెప్టెంబర్ 4న థియేటర్లలోకి ‘ధర్మస్థల నియోజకవర్గం’ | Dharmasthala Niyojakavargam Movie Release Update | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 4న థియేటర్లలోకి ‘ధర్మస్థల నియోజకవర్గం’

Aug 20 2026 10:29 PM | Updated on Aug 20 2026 10:29 PM

Dharmasthala Niyojakavargam Movie Release Update

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. పివిఆర్ సినిమాస్  డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దీనిని రిలీజ్ చేయనున్నారు.

హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ- నేను హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం కంటే ఒక నటిగా మంచి గుర్తింపు పొందాలని కోరుకున్నాను. నటిగా నాకు మంచి పేరు తెచ్చే క్యారెక్టర్ ఈ సినిమాలో చేశానని పేర్కొంది. నటి కస్తూరి మాట్లాడుతూ - ఇలాంటి సినిమా ఇప్పుడున్న సమాజానికి కావాలి. ఈరోజు జెన్ జీ ఆటపాటలతో సరదాగా సమయం గడపడం లేదు. ఆలోచిస్తున్నారు. అలాంటి యువతకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement