కొనంకి ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ యాక్షన్ థ్రిల్లర్ 'సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అధికారికంగా విడుదల చేసింది. దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధతకు ప్రతీకగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కొనంకి కార్తీక్ శక్తివంతమైన సైనికుడి పాత్రలో కనిపించారు. యుద్ధ వాతావరణం, పోరాట ఛాయలు, గర్వంగా రెపరెపలాడుతున్న భారత త్రివర్ణ పతాకం మధ్య ఆయన లుక్ వదిలారు.
"24×7 ఆన్ డ్యూటీ" ట్యాగ్‌లైన్‌తో దేశ సరిహద్దుల్లో నిరంతరం విధులు నిర్వహిస్తూ దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేసే భారత సైనికులకు ఈ చిత్రం ఘన నివాళిగా నిలవనుంది. ఈ చిత్రంలో కొనంకి కార్తీక్, ప్రియాంక వర్మ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. శ్రద్ధ ఖత్రి దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.నాయుడు నిర్మిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి, మానవీయ విలువల సమ్మేళనంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.


