ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా | Laggam Time Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: తెలుగు మూవీ.. సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్

Apr 25 2026 2:49 PM | Updated on Apr 25 2026 2:58 PM

Laggam Time Movie OTT Streaming Now

ఈ వారం ఓటీటీల్లోకి బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, మెన్షన్ హౌస్ మల్లేష్, హ్యాపీరాజ్ తదితర స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?

(ఇదీ చదవండి: ఓటీటీలో హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ సినిమా.. తెలుగు రివ్యూ

రాజేశ్ మేరు, నవ్య చిట్యాల హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా 'లగ్గం టైమ్'. ఈ ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో జనాలు తెలియకుండానే బిగ్‌స్క్రీన్‌పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.

'లగ్గం టైమ్' విషయానికొస్తే.. అనన్య(నవ్య) పెళ్లిరోజున బాయ్ ఫ్రెండ్ సూర్య(రాజేశ్).. పెళ్లి ఇంటి నుంచి ఈమెని తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ జరిగిన ఓ అనుకోని సంఘటన వల్ల పరిస్థితులు మారిపోతాయి. మరోవైపు పెళ్లికొడుకు చంద్ర కిడ్నాప్ అవుతాడు. ఈ కేసులో సూర్యనే నిందితుడిగా అనుమానిస్తూ పోలీసులు పట్టుకుంటారు. అసలు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? పూణెలో మొదలైన సూర్య-అనన్య ప్రేమకథకు చివరకు శుభం కార్డు పడిందా లేదా?అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ‍'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement