
అంకిత్, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బ్యూటీ'. విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించారు. జెఎస్ఎస్ వర్దన్ దర్శకత్వం వహించాడు. గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి స్పందన అందుకుంటోంది. ఈ క్రమంలోనే శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు.
వీకే నరేష్ మాట్లాడుతూ.. 'బ్యూటీ'లోని సోల్ మా అందరితో ప్రమోషన్స్‌లో ఎక్కువ మాట్లాడించేలా చేసింది. అదే ఇప్పుడు ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతోంది. దర్శక, నిర్మాతలకు సినిమా రిలీజ్‌కంటే ముందే శాలువా కప్పేశాను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు ముందే తెలుసు. అందరి మనసులకు హత్తుకునే మూవీని తీసిన వర్దన్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది అని అన్నారు.
అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. మా సినిమా అందరికీ రీచ్ అయింది. క్లైమాక్స్ తర్వాత అందరూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. అదే మా విజయం. మనం చేసే పని మాత్రమే కాదు.. మనం కూడా మాట్లాడాలి. నేను నటించిన ఏ మూవీ కూడా ఏ ఒక్కరినీ నిరాశపర్చలేదు. సినిమాను నిజాయితీగా తీస్తే సక్సెస్ అదే వస్తుంది అని చెప్పాడు.